శివశంకర్ కుటుంబానికి చిరు ఆర్థిక సాయం - మెగాస్టార్
కొవిడ్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నృత్యదర్శకుడు శివశంకర్ మాస్టర్ (Sivasankar Master Health) కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. శివశంకర్ మాస్టర్ వైద్య ఖర్చుల కోసం రూ.3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. మాస్టర్ ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్సను ఆయన కుమారుడు అజయ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ సహాయం ఎప్పటికీ మరచిపోలేమని, శివశంకర్ మాస్టర్‌కు చిరంజీవి (Chiranjeevi News) అంటే ఎనలేని గౌరవమని ఆయన కుమారుడు అజయ్ తెలిపారు.