'నేను, సురేఖ.. రోజూ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం' - telugu cinema news
గురువారం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస అయింది. అనంతరం.. 'మా'లో వస్తున్న విభేదాలపై మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి తన దాంపత్యం గురించి చెప్పాడు. గొడవలు వచ్చినా సర్దుకుపోవాలని అన్నాడు. "నేనూ, నా భార్య సురేఖ రోజూ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. కానీ బయటకు వెళ్తే చేతిలో చేయి వేసుకొని ముచ్చటగా కనిపిస్తాం. మమ్మల్ని చూస్తే ఆదర్శ దంపతులు అనుకుంటారు. ఇంటికి వెళ్తే చేయి వదిలేసుకుంటాం. ఒక కుటుంబం అంటే చిలిపి సంఘటనలు ఉంటాయి. కాబట్టి సర్దుకుపోవాలి" అని అన్నాడు.