పునీత్ కోసం అంతా కలిసి ఆ పని చేద్దాం: మంచు మనోజ్ - puneeth rajkumar padmashree
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు (Puneeth Rajkumar death) పద్మశ్రీ వచ్చేలా అన్ని చిత్ర పరిశ్రమల ప్రముఖులు ప్రయత్నాలు చేయాలని తెలుగు సినీ నటుడు మంచు మనోజ్ (Manchu Manoj news) కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని పిలుపునిచ్చారు. తెలుగు పరిశ్రమ నుంచి తాము ఈ ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. బెంగళూరులో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన పునీత్ సంతాప సభకు (Puneeth Rajkumar padma shri award) హాజరైన మంచు మనోజ్.. దివంగత నటుడిని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.