'ఒకే సినిమాలో ఐదు కథలను చెప్తున్నా' - తెలుగు తాజా సినిమా
ఐటీ రంగాన్ని వదిలి ఇష్టమైన సినిమా దర్శకత్వంలో అడుగు పెట్టి చాలామంది యువ దర్శకులు విజయాలందుకున్నారు. ఈ క్రమంలోనే మరో ఐటీ ఉద్యోగి తెలుగు చిత్రసీమలో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. అతని పేరు అనిల్ పంగలూరి. 14 ఏళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండి... 'క్షీరసాగర మథనం' అనే సినిమాతో పరిచయం కాబోతున్నాడు. తనకు సినిమా పరిశ్రమ పట్ల ఆసక్తి కలగడానికి కారణాలు ఎంటో?..ఎలాంటి కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నాడో.. ఈటీవీ భారత్కు తెలియజేశాడు.