'అమ్మాయి కోసం గుండు కొట్టించుకున్నా' - guna 369
'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు కార్తికేయ. మొదటి చిత్రంతోనే తనకంటూ మంచి గుర్తింపు సాధించాడు. ఇటీవలే విడుదలైన 'గుణ 369' మూవీతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న ఈ యువ నటుడు కాలేజీలో అమ్మాయి కోసం గుండు కొట్టించుకున్న విషయాన్ని పంచుకున్నాడు.