'మా ఆయన చంటిపిల్లాడు.. నేను క్షమాపణలు చెబుతున్నా' - telugu cinema news
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ విడుదల కార్యక్రమం సందర్భంగా, 'మా'లో ఉన్న విబేధాలపై నటుడు రాజశేఖర్ వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై గట్టి చర్యలు తీసుకోవాలని 'మా'ను కోరారు. అనంతరం జీవిత క్షమాపణలు చెప్పారు. ఆయన(రాజశేఖర్) చిన్నపిల్లాడని, ఇలాంటి కార్యక్రమంలో అలా మాట్లాడినందుకు క్షమించమని కోరుతున్నానన్నారు. నరేష్, రాజశేఖర్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ఇక ముందూ తామందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని జీవిత చెప్పారు.