'చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా..!' - చౌరస్తా బ్యాండ్ న్యూస్
ఆయుధాలు లేకుండా కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తోన్న ప్రపంచం.. బతికి బట్టకట్టాలంటే ప్రతి మనిషి బాధ్యతగా ప్రవర్తించాలని ప్రముఖ జానపద బ్యాండ్ 'చౌరస్తా' బృందం విజ్ఞప్తి చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు తమవంతు సామాజిక బాధ్యతగా 'చేతులెత్తి మొక్కుతా' అనే ప్రత్యేక గీతాన్ని ఆలపించింది. రామ్ మిర్యాల స్వీయ రచన సంగీతాన్ని సమకూర్చిన ఈ పాట.. సామాజిక మాధ్యమాల్లో విడుదలైన కొన్ని క్షణాల్లోనే విశేష ఆదరణ పొందుతూ ప్రజల్లో కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తోంది. లోకమంటే వేరుకాదు.. నువ్వే ఆ లోకమంటున్న చౌరస్తా బ్యాండ్ గాయకులు, కంపోజర్ రామ్ మిర్యాలతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.