'నువ్వేకావాలి' సినిమాకు 20 ఏళ్లు.. రిచా ఆనందం
'నువ్వే కావాలి' సినిమా నిన్నే వచ్చినట్లుందని, అప్పుడే 20 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నానని అందులో నటించిన హీరోయిన్ రిచా ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నిర్మాత రామోజీరావు, హీరో తరుణ్, దర్శకుడు విజయ్ భాస్కర్లకు శుభకాంక్షలు చెప్పింది. మంగళవారానికి(అక్టోబరు 13) ఈ చిత్రం వచ్చి 20 సంవత్సరాలు.