తెలంగాణ

telangana

ETV Bharat / videos

Hero movie: 'ఈ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను' - hero movie success meet

By

Published : Jan 15, 2022, 7:14 PM IST

మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు సినిమా హీరో అవ్వాలన్న తన కలను ఎలా సాకారం చేసుకున్నాడనే కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం హీరో. సూపర్​స్టార్​ మహేశ్​ బాబు మేనల్లుడు గల్లా అశోక్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల తొలిరోజే ప్రేక్షకులు హీరోకు మంచి మార్కులే వేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో చిత్ర బృందం బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకుంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకులు ఇచ్చిన విజయాన్ని ఎప్పటికి మరిచిపోలేనని అశోక్ ఆనందం వ్యక్తం చేయగా.... పండగకి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ప్రయత్నం సఫలమైందని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెలిపారు. తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details