'పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత' - celebrities in green india challenge
భావితరాలు సంతోషంగా ఉండాలంటే, ఈ పుడమితల్లిని పచ్చగా ఉంచాలని యువహీరో కార్తీకేయ కోరాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటుడు విశ్వక్ సేన్ ఛాలెంజ్ స్వీకరించి, జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటి తనవంతు బాధ్యత చాటుకున్నాడు. పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశాడు. ఇందులో తనను భాగస్వామ్యం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.