'హైదరాబాద్ సినీ పరిశ్రమకు నేను అతిథినే'
గొల్లపూడి మారుతీరావు..... తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకో ప్రత్యేకత ఉంది. కాసింత విలనిజం, మరికొంత కుత్సితం, ఇంకొంత హాస్యం కలగలిపితే... ఆయన సినిమాలో పోషించిన పాత్రలు ప్రాణం పోసుకుంటాయి. కడుపుబ్బ నవ్వించే కామెడీ అయినా.. విషం కక్కే విలనిజం అయినా... కంటతడి పెట్టించే కరుణరసమైనా... నటవిశ్వరూపాన్ని చూపించగల నటుడు గొల్లపూడి. కొన్ని సందర్భాల్లో తాను హైదరాబాద్ సినీ పరిశ్రమకు అతిథిగా మాత్రమే అని మద్రాసు సినీ పరిశ్రమకు బంధువునని చెప్పుకొచ్చారు. ఇదేకాక గొల్లపూడి మనసులోని మరికొన్ని మాటలు మీకోసం.