అనుష్కకు ఆ విషయం అప్పుడే చెప్పా: రాఘవేంద్రరావు
హీరోయిన్ అనుష్క.. ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమం, హైదరాబాద్లో గురువారం జరిగింది. అతిథిగా హాజరైన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. స్వీటీపై పొగడ్తలు కురిపించాడు. స్వీటీ టాలీవుడ్లో గొప్ప హీరోయిన్ అవుతుందని తాను గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.