బాలయ్య-బన్నీ మల్టీస్టారర్ సినిమా.. బోయపాటి క్లారిటీ - అల్లుఅర్జున్ బాలకృష్ణ మల్టీస్టారర్ సినిమా
Balakrishna Alluarjun movie: హైదరాబాద్‌లో బుధవారం 'అఖండ' సంక్రాంతి సంబరాలు ఈవెంట్ ఘనంగా జరిగింది. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర సంగతుల గురించి చిత్రబృందం తెలిపింది. ఇందులో భాగంగా.. 'బాలయ్య, అల్లుఅర్జున్‌తో కలిసి మల్టీస్టారర్(బీబీబీ) ఉంటుందా' అని ఓ విలేకరి అడగగా దర్శకుడు బోయపాటి దీనిపై స్పష్టతనిచ్చారు. "ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏది జరగదు అని మాత్రం పొరపాటుగా కూడా అనుకోవద్దు. ఇక్కడ ఏది, ఎప్పుడు, ఎలా జరగాలనేది కాలం నిర్ణయిస్తుంది. అది నిర్ణయించిన రోజు తప్పకుండా ఏదైనా జరుగుతుంది." అని బోయపాటి బదులిచ్చారు.