తెలంగాణ

telangana

ETV Bharat / videos

Dhee: మాస్ డ్యాన్స్​తో దుమ్మురేపిన రష్మీ - రష్మీ మాస్ డ్యాన్స్

By

Published : Jun 4, 2021, 12:39 PM IST

యువ డ్యాన్సర్లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, వారిలోని ప్రతిభను వెలికితీస్తోన్న షో 'ఢీ' (Dhee). ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమవుతోన్న ఈ షోకు ప్రేక్షకాదరణ మెండుగా లభిస్తోంది. ఇప్పటికే 12 సీజన్లు పూర్తి చేసుకున్న కార్యక్రమం 13వ సీజన్ (Dhee 13 kings vs queens)​ ముగింపునకు వచ్చేసింది. ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్, ఆది, రష్మీల కామెడీ పంచ్​లతో ఈ షో కడుపుబ్బా నవ్విస్తోంది. అప్పుడప్పుడూ సుధీర్, రష్మీ చేసే డ్యాన్స్​లు ఆకట్టుకుంటాయి. తాజాగా రష్మీ చేసిన ఓ మాస్ డ్యాన్స్​ నెట్టింట వైరల్​గా మారింది. డప్పు చప్పుల్లకు రష్మీ దుమ్మురేపింది. ఈ ఎపిసోడ్ వచ్చే బుధవారం (జూన్ 9) రోజున ఈటీవీలో రాత్రి 9.30 గంటలకు ప్రసారంకానుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి.

ABOUT THE AUTHOR

...view details