సైరా తర్వాతే చాణక్య చూస్తా: మెహరీన్ - gopicahnd
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం చాణక్య. మెహరీన్, జరీన్ ఖాన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక ముఖాముఖీలో పాల్గొంది. ఈ ఏడాది తనకు బాగా కలిసివచ్చిందని చెప్పింది హీరోయిన్ మెహరీన్. సంక్రాంతికి ఎఫ్2 విడుదల కాగా.. ఈ పండగకి చాణక్య వస్తుందని చెప్పింది. అయితే తను ముందు సైరానే చూస్తానని తర్వాత చాణక్య వీక్షిస్తానని తెలిపింది.