నిందితులకు ఇదే సరైన శిక్ష: బాలకృష్ణ - priyanka reddy murder
దిశ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ విషయంపై స్పందించాడు నందమూరి హీరో బాలకృష్ణ. మరోసారి ఇలాంటి ఘటనకు పాల్పడే వారికి ఇది సరైన గుణపాఠంగా నిలవాలని అన్నాడు. ముందు ముందు ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని కోరాడు. నిందితులకు విధించిన శిక్ష పట్ల తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు అభినందనలు తెలిపాడు బాలయ్య.