'నిశ్శబ్దం' కోసం శిర్డీ సాయినాథుడికి అనుష్క ప్రార్థనలు - శిర్డీ సాయునాథుడి సేవలో అనుష్క
టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శెట్టి... శిర్డీ సాయి ఆలయాన్ని సందర్శించింది. సాయినాథుడికి నిర్వహించే కాకడ హారతిలో కుటుంబ సమేతంగా పాల్గొంది. పూజారుల ఆశీర్వాదాలు తీసుకుంది. స్వీటీ తాజా చిత్రం.. నిశ్శబ్దం. మాధవన్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో జనవరి 31న విడుదలకానుంది.