'నేను పడుకునేప్పుడు.. ఆ ముగ్గురునీ తలుచుకుంటాను'
'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన నటి కస్తూరి శంకర్.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పడుకునే ముందు కచ్చితంగా తన జీవితంలో ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులను తలుచుకుంటానని చెబుతోందీ అందాల భామ. తనకు నిద్రలేమి కారణంగా నిద్ర పట్టేది కాదని.. అది తగ్గడానికి వారే కారణమని తెలిపింది. ప్రతిరోజూ వారితో మాట్లాడిన తర్వాతే నిద్రిస్తానని వెల్లడించింది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో కస్తూరి మాటల్లోనే విందామా.
Last Updated : Aug 18, 2020, 8:37 PM IST