హేమమాలిని, రవి కిషన్ నృత్య ప్రదర్శన- మార్మోగిన ఆడిటోరియం - వారణాసి ఫిల్మ్ ఫెస్టివల్
Kashi Film Festival: ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో కాశీ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో రెండో రోజైన మంగళవారం.. బాలీవుడ్ అలనాటి నటి, భాజపా ఎంపీ హేమమాలిని నృత్య ప్రదర్శన చేశారు. శివపార్వతుల వివాహ నాటికలో అద్భుతంగా నటించారు. మరో నటుడు, భాజపా ఎంపీ రవి కిషన్ ప్రదర్శనకు ఆడిటోరియం మార్మోగిపోయింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.