దెయ్యం దెబ్బకు అర్ధరాత్రి ఇల్లు ఖాళీ చేసిన అంజలి - ali tho saradaga show anjali
తనకు దెయ్యాలంటే అప్పట్లో భయముండేదని, ఆ భయంతోనే గతంలో ఉన్న ఇల్లు ఖాళీ చేశానని హీరోయిన్ అంజలి చెప్పింది. 'ఆలీతో సరదాగా' టాక్ షోకు హాజరైన ఈ ముద్దుగుమ్మ.. వీటితో పాటే బోలెడు విషయాలు పంచుకుంది. అయితే హారర్ సినిమాలు చేసిన తర్వాత, ఆరు నెలల వరకు దెయ్యాలంటే భయం వేయదంది. ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికొస్తుందని తెలిపింది.