వలస కార్మికులకు నటుడు శ్రీకాంత్ ఆహార వితరణ - tollywood news
సినీ నటుడు శ్రీకాంత్.. వలస కార్మికులకు మధ్యాహ్నం భోజనం, తాగునీరు అందజేశారు. యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్కు వద్ద, ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఆహారం అందించారు. దీనితో పాటే సినీ వేతన కార్మికులను ఆదుకుంటున్నట్టు వివరించారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించాలని కోరారు. అయితే పోలీసులతో అనుమతితోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శ్రీకాంత్ చెప్పారు.