వలసకార్మికులకు నటుడు శ్రీకాంత్ ఆహార వితరణ - actor srikanth food distribution
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు, కార్మికుల ఆకలి తీర్చేందుకు సినీహీరో శ్రీకాంత్, ఫీడ్ ద హంగ్రీ సభ్యులు ముందుకు వచ్చారు. ఇప్పటికే ఈ సంస్థ చేస్తున్న కృషిని మెచ్చుకొన్న శ్రీకాంత్.. తనవంతు సాయంగా కార్మికులకు ఓరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గోపన్పల్లి ఎన్.టి.ఆర్ నగర్లో ఇతరరాష్ట్రాలకు చెందిన 600 మంది కార్మికులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. కరోనా కట్టడికి ప్రతిఒక్కరు ప్రభుత్వం సూచలను పాటిస్తూ, పోలీసులకు సహకరించాలని కోరారు.