'ఆమె లేకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్యే' - SAI KUMAR ALI THO SARADAGA
ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' టాక్షోకు నటుడు సాయి కుమార్ ఇటీవలే హాజరయ్యారు. గతంలో 'ఈశ్వర్ అల్లా' సినిమా విషయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నామని, తన భార్య సురేశ్ తమను కాపాడిందని తెలిపారు. వీటితో పాటు పలు విషయాలు పంచుకున్నారు.