'మన దేశం మనందరం ఒకటే అని నిరూపిద్దాం' - సినిమా వార్తలు
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. రేపు(ఆదివారం) జరగబోయే 'జనతా కర్ఫ్యూ'కు మద్దతుగా నిలిచాడు. తన సందేశాన్ని పంచుకున్నాడు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లలో ఉండి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచనను పాటిద్దామని అన్నాడు. మన దేశం మనందరం ఒకటే అని నిరూపిద్దామని చెప్పాడు.