బాలు.. నీ రాక కోసం అందరం ఎదురుచూస్తున్నాం - ఎస్పీ బాలు కరోనా
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పరిస్థితిపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకుని రావాలని, అందరం బాలు రాక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎమ్జీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీబీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు సోమవారం వెల్లడించారు.