'అందుకే చిరంజీవి సినిమాలో నటించనని చెప్పా' - జయప్రకాష్ రెడ్డి ఆలీతో సరదాగా
ఉత్తమ ప్రతినాయకుడిగా 'జయం మనదేరా' సినిమాలో నంది అందుకున్నా.. రంగస్థలంపై తనకు ఐదు నంది బహుమతులు వచ్చాయని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో చెప్పారు జయప్రకాశ్ రెడ్డి. 'అలెగ్జాండర్' అనే నాటకంలో 100 నిమిషాల పాటు ఏకపాత్రాభినయం చేశానని తెలిపారు. అది తనకు చాలా పేరు తెచ్చిందని వెల్లడించారు. దర్శకుడు శ్రీనువైట్లతో ఉన్న అనుబంధం గురించి చెప్పిన ఆయన.. చిరంజీవి నటించిన 'అందరివాడు'లో అవకాశం ఎలా కోల్పోయారో వివరించారు.