రాజమౌళి 'నాటు' డాన్స్.. ఆ రోజు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ - ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్
RRR Movie Team: బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆర్‌ఆర్‌ఆర్' మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో.. చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా 'ఆర్‌ఆర్‌ఆర్ విత్ ఆర్' పేరుతో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్‌లను దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు 'ఆర్‌ఆర్‌ఆర్'లు సమాధానాలిచ్చారు. కాగా, ఈ ఇంటర్వ్యూలో తారక్.. దర్శకధీరుడు రాజమౌళికి ఒక ఛాలెంజ్ విసిరారు. మార్చి 25న సినిమా రిలీజ్ మార్నింగ్ షో అయ్యాక.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ తమతో కలిపి 'నాటు నాటు' స్టెప్ వేయాలని అన్నారు. ఆ సవాల్‌ను స్వీకరించిన జక్కన తప్పకుండా వేస్తానని మాట ఇచ్చారు. అయితే నాటు నాటు కాకుండా థ్యాంక్యూ థ్యాంక్యూ అని వేస్తామని తారక్ అన్నారు(నవ్వుతూ).
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST