ఎవ్వరికీ తెలియని రాజమౌళి సీక్రెట్.. బయటపెట్టేసిన తారక్ - రామ్‌చరణ్
RRR Memes Interview: దర్శకధీరుడు రాజమౌళికి సంబంధించి ఓ ఆసక్తికర విశేషాన్ని పంచుకున్నారు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. మార్చి 25న 'ఆర్ఆర్ఆర్' విడుదల సందర్భంగా యాంకర్ సుమతో చేసిన మీమ్స్ ఇంటర్వ్యూలో ఈ సీక్రెట్‌ను వెల్లడించారు. అదేంటంటే.. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్రబృందం. వేడుకలో తారక్-చెర్రీ ఎంట్రీని గ్రాండ్‌గా ప్లాన్ చేశారు జక్కన్న. అయితే అది అనుకున్న విధంగా రాకపోవడం వల్ల బైక్‌ను, గుర్రాన్ని ముంబయి నుంచి హైదరాబాద్ రప్పించి, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో వారి ఎంట్రీని మరోసారి షూట్ చేశారట. దానినే ఆ తర్వాత విడుదల చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియోలో పెట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST