తీరానికి లక్షల్లో అరుదైన తాబేళ్లు.. అద్భుత దృశ్యాలు
Olive Ridley Turtle: ఒడిశాలోని కేంద్రాపాడా సముద్రతీరానికి లక్షల సంఖ్యలో అరుదైన రకానికి చెందిన తాబేళ్లు వచ్చాయి. భీతర్కనికా జాతీయ పార్క్ పరిధిలోని గహిర్మతా మెరైన్ అభయారణ్యం వద్ద దీవులకు 2,45,188 ఆలివ్ రిడ్లీ తాబేళ్లు చేరుకున్నాయి. ఏటా గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాబేళ్ల రక్షణ కోసం అటవీ శాఖ నుంచి 30 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించడం సహా మే 31 వరకు ఆ ప్రాంతంలో చేపల వేటపై నిషేధం విధించారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST