'శ్రీవల్లి'ని వాయించిన ముంబయి పోలీసులు - శ్రీవల్లి
Pushpa Srivalli Song: 'పుష్ప' చిత్రంలోని శ్రీవల్లి పాట చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పుష్ప సినిమా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. అనేక మంది ప్రముఖులు శ్రీవల్లి పాటలోని స్టెప్పులు వేసి అబ్బురపరిచారు. తాజాగా ముంబయి పోలీసులు క్లారినెట్, సాక్సోఫోన్, ట్రంపెట్, ఫ్లూట్ వంటి వాయిద్యాలతో ఇదే పాటను వాయించి అందరిని ఆకట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST