Prathidwani: ఉక్రెయిన్ ముందున్న మార్గమేంటి? - prathidwani debate on Russia Ukraine war
ఉక్రెయిన్‌పై రష్యా భీకరమైన దాడి చేసింది. రాజధాని కీవ్‌లోకి రష్యా సైన్యాలు ప్రవేశించాయి. ఉక్రెయిన్‌ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన రష్యా.. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని ఉక్రెయిన్ సైన్యాలను హెచ్చరించింది. బెలారస్‌లోని మిన్స్‌క్‌లో చర్చలకు బృందాన్ని పంపిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ కార్యాలయం ప్రకటించింది. అయితే ఉక్రెయిన్ మాత్రం రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నామని ప్రకటించింది. ప్రజలు ఆయుధాలు చేతబట్టి రష్యా సైనికులను ఎదుర్కోవాలని అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. సైనిక దుస్తులు ధరించి జెలెన్‌స్కీ సాయుధుడై యుద్ధంలోకి దిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ యుద్ధం తీవ్రత ఎలా ఉంటుంది అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST
TAGGED:
Prathidwani debates