Prathidwani: పెరిగిన విద్యుత్ ఛార్జీల భారాల్ని ప్రజలు మోయగలరా? - రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు
Prathidwani: రాష్ట్రంలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాలు, ఎలక్ట్రానిక్ వాహనాలకు ఇంధన సబ్సిడీలు ప్రకటించిన ప్రభుత్వం.. గృహ వినియోగదారులపై మాత్రం భారం మోపింది. విద్యుత్ కొనుగోళ్ల వ్యయాలు పెరిగాయన్న కారణంతో డిస్కంల నష్టాలు పూడ్చేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. అయినప్పటికీ లోటు మిగిలే ఉంటుందన్న అంచనాలను ప్రభుత్వం ఈఆర్‌సీకి సమర్పించింది. ఈ లోటును పూడ్చుకునేందుకు ప్రజలపై వినియోగ ఛార్జీల భారం వేసింది. అసలు డిస్కంలకు నష్టాలు ఎందుకొస్తున్నాయి? ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఎందుకు సరిపోవడం లేదు? పెంచిన విద్యుత్ ఛార్జీల భారాల్ని ప్రజలు మోసేదెలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST