Prathidwani: వరిరైతులు భాజపా-తెరాస పార్టీల్లో ఎవరివాదన నమ్మాలి? - ts news
Prathidwani: యాసంగి వడ్ల సేకరణపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరింది. యాసంగి సీజన్‌లో బియ్యం కాదు వడ్లే ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తే.. కాదుకాదు ముడిబియ్యం ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల క్రితమే లేఖ రాసిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర అవసరాలకు సేకరించింది పోను మిగిలిన ముడిబియ్యం అంతా కొంటామని భాజపా చెబుతుంటే... యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే ముడిబియ్యమే వస్తుందన్న విషయం తెలియదా అంటూ తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ వడ్ల పంచాయితీలో రైతులు ఎవరి మాట నమ్మాలి? కేంద్రం, రాష్ట్రం మధ్య రాజుకున్న ధాన్యం కొట్లాటలో రైతులకు జరిగే ప్రయోజనం ఎంత? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST