Prathidwani: భూ వివాదాల్లో పగబట్టి చంపుకునేంత కక్షలు ఎందుకు? - prathidwani debates on land records
రాష్ట్రంలో పెరిగిన భూముల ధరలతోపాటే హత్యా నేరాలూ పెరుగుతున్నాయి. భూరికార్డుల్లో లోపాలు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కబ్జాలు, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయి. అంగబలం, అర్థబలం ఉన్నవారు సెటిల్‌మెంట్లతో బేరసారాలకు దిగుతున్నారు. ఈ మొత్తం భూవివాదాల దందాలో సామాన్యులు కష్టాల పాలవుతుంటే.. అక్రమార్కులు ఆస్తులు పోగేసుకుంటున్నారు. కథ అడ్డం తిరిగిన చోట్ల కర్ణగూడ వంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ రియల్ హత్యలు ఘర్షణలు, దాడులు, నేరాలకు అడ్డుకట్ట వేసేదేలా? దీనిపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST