రోడ్డు పక్కన స్టాల్లో 'టీ' తాగిన మోదీ.. కాశీలో 'ఛాయ్ పే చర్చ' - వారణాసి ఎన్నికలు
PM Modi in Varanasi: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా తన సొంత నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రోడ్ షోలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న ఓ టీ స్టాల్‌కు వెళ్లి ఛాయ్ తాగారు. 'కాశీ ప్రజలతో ప్రధాని మోదీ ఛాయ్ పే చర్చ చేపట్టారు' అని భాజపా ట్వీట్ చేసింది. ప్రధాని ఛాయ్ తాగుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ క్రమంలోనే హోటల్లో ఉన్న కస్టమర్లు, సామాన్యులతో మాట్లాడారు మోదీ. తన హోటల్‌కు ప్రధాని రావటంపై సంతోషం వ్యక్తం చేసిన యజమాని.. మోదీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST