పెట్రోల్ డబ్బులు అడిగినందుకు బంక్ యజమానిపై దాడి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో కొంత మంది దుండగులు రెచ్చిపోయారు. కొత్వాలి ప్రాంతంలోని ఓ జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ పంపు యజమానిపై దాడి చేశారు. తమ వాహనాల్లో పెట్రోల్ పోయించుకుని.. డబ్బులు ఇవ్వాలని సిబ్బంది కోరగా దానికి నిరాకరించారు. దీంతో గొడవ ప్రారంభమైంది. కొద్దిసేపటికి బయట నుంచి కొందరు వ్యక్తులు వచ్చి సిబ్బందిపై దాడి చేశారు. గొడవ జరుగుతుందని గమనించిన యజమాని బయటకు వచ్చి వారిని అడ్డుకోగా ఆయన మీద కూడా దాడికి దిగారు. చంపేస్తామని బెదిరించారు. అనంతరం యజమాని ఇంటికి వెళ్తుంటే అతని కారును ఢీ కొట్టారు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంక్‌లో జరిగిన దృశ్యాలు సీసీటీవీలో నమోదు అయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST