బ్రిడ్జిపైనుంచి దూకిన పేషెంట్.. పోలీసులు ఎలా కాపాడారంటే..? - రాయ్‌పుర్‌లో మానసిక రోగి హల్చల్
తనకు సరిగ్గా చికిత్స అందడం లేదంటూ ఓ మానసిక రోగి హల్చల్ చేశాడు. అంబేడ్కర్ ఆసుపత్రి ముందున్న బ్రిడ్జిపైకి ఎక్కి రోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతడిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఆ మానసిత రోగి ఎవరి మాట వినకుండా బ్రిడ్జిపై నుంచి దూకేశాడు. రోగి కిందకి దూకేటప్పుడు పోలీసులు వలను పెట్టి కాపాడారు. స్వల్ప గాయాలతో రోగి ప్రాణాలతో బయటపడగా.. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మానసిక రోగిని మధ్యప్రదేశ్‌కు చెందిన సుజిత్ సాకేత్‌గా గుర్తించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో మంగళవారం జరిగింది.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST