తెలంగాణ

telangana

Zaheer Uddin Ali khan Latest News

ETV Bharat / videos

Zaheeruddin Ali khan Funeral : జహీరుద్దీన్ అలీఖాన్​​కు కన్నీటి వీడ్కోలు.. ఆయన సేవలు స్మరించుకున్న బీఆర్ఎస్ మంత్రులు - Zaheeruddin Ali Siasat Passed Away

By

Published : Aug 8, 2023, 1:17 PM IST

Zaheeruddin Ali khan Funeral ప్రజాగాయకుడు గద్దర్‌ అంతిమ యాత్రలో మృతి చెందిన జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని తమ స్వగృహంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ పరామర్శించారు. సోమవారం రోజున అల్వాల్​లో గద్దర్ ఇంటి వద్ద జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. తోపులాటలో కిందపడిపోయిన ఆయనకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సీనియర్ జర్నలిస్ట్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ఆర్థిక మంత్రి హరీశ్ రావు, హోం మంత్రి మహమూద్ అలీ సంతాపాన్ని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు.. జహీరుద్దీన్ అలీఖాన్ ఉర్దూ పత్రిక రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని.. మజీద్ నుంచి దారుసలాంలో జహీరుద్దీన్ అలీఖాన్​కు కుటుంబసభ్యులు, బంధు మిత్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details