Yuvagalam TDP Flags Display at Eiffel Tower ఫ్రాన్స్ ఐఫిల్ టవర్ వద్ద యువగళం జెండా రెపరెప.. లోకేశ్‌కు శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ అభిమానులు - ఫ్రాన్స్‌లో యువగళం టీడీపీ జెండా
Published : Sep 2, 2023, 3:17 PM IST
Yuvagalam TDP Flags Display at Eiffel Tower: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అభిమాన ఎల్లలు దాటింది. తెలుగు గడ్డపైన మాత్రమే కాకుండా.. యువగళం, తెలుగుదేశంపై అభిమానాన్ని తెలుగు తమ్ముళ్లు విదేశాల్లో ప్రదర్శిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రముఖ పట్టణమైన పారిస్ ఐఫిల్ టవర్ ప్రాంగణంలో యువగళం, టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. అయితే ఇటీవల ఇంగ్లడ్‌లో స్థిరపడిన ఏపీకి చెందిన ప్రముఖ వైద్యులు ఏలూరులో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న లోకేశ్‌కు మద్దతు తెలిపారు. ఇలా దేశ విదేశాల్లో యువగళం అభిమానులను సొంతం చేసుకుంటోంది.
ఈ సంవత్సరం జనవరి 27 ప్రారంభమైన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. పాదయాత్ర ప్రారంభమైన 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా.. పారిస్‌లోని ఐఫిల్ టవర్ వద్ద వినోద్ యువగళం జెండాతోపాటు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి అభిమానాన్ని చాటుకున్నారు. యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని ఆయన కోరుకున్నారు. మంగళగిరి నియోజవర్గానికి చెందిన వినోద్.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టాలని ఆకాంక్షిస్తూ.. ఐఫిల్ టవర్ వద్ద యువగళం జెండాను ప్రదర్శించినట్లు తెలిపారు.