Yuri Reddy Press Conference Against Margadarsi: విలేకరుల సమావేశంలో తడబడిన యూరిరెడ్డి.. - AP Latest News
Published : Oct 18, 2023, 10:18 AM IST
Yuri Reddy Press Conference Against Margadarsi:మార్గదర్శి సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. మార్గదర్శిపై అక్రమంగా దాడులు చేసి, కేసులు పెట్టి, ఖాతాదారుల్ని భయపెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఇంకో కట్టుకథ అల్లింది. తాజాగా యూరిరెడ్డి అనే వ్యక్తితో తప్పుడు ఫిర్యాదు చేయించి.. మార్గదర్శి సంస్థ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ఏపీ సీఐడీతో కుట్రపూరితంగా మరో కేసు నమోదు చేయించింది.
మార్గదర్శిపై సీఐడీకి తప్పుడు ఫిర్యాదు చేసిన గాదిరెడ్డి యూరిరెడ్డి విలేకర్ల సమావేశంలోనూ మరిన్ని అబద్ధాలతో బురద చల్లే ప్రయత్నం చేశారు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన విషయాలనే మళ్లీ ఇక్కడ ప్రస్తావించారు తప్ప విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడ్డారు. ఒకదశలో యూరిరెడ్డితో పాటు ఆయన న్యాయవాది శివరామిరెడ్డి విలేకర్లతో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్‌లో కాకుండా ఏపీ సీఐడీకి ఎందుకు ఫిర్యాదు చేశారని, 2016లో షేర్లు బదిలీ చేస్తే ఇప్పుడెందుకు ఫిర్యాదు చేశారన్న ప్రశ్నలకు వారు సంబంధం లేని సమాధానాలిచ్చారు. విలేకర్ల సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.