YSRCP MP Magunta Became An Approver in Delhi Liquor Case దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట - YSRCP MP Became An Approver in Delhi Liquor Case
Published : Sep 8, 2023, 9:53 PM IST
YSRCP MP Magunta Became An Approver in Delhi Liquor Case దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్లీ మద్యం కుంభకోణంలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. దిల్లీ మద్యం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈడీ విచారణలో ఆయన (మాగుంట శ్రీనివాసులు రెడ్డి) కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. అయితే, దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మారిన వాళ్లలో అధికంగా సౌత్ గ్రూపునకు చెందినవారే ఉండటం గమనార్హం. ఈ కేసు విషయంలో ముందుగా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఆ తర్వాత శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి అప్రూవర్‌గా మారారు. ప్రస్తుతం రాఘవ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు బెయిల్‌పై ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా అప్రూవర్‌గా మారారు.
మరోవైపు అప్రూవర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ పలువురిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి.. ఇప్పటికే రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, తాజాగా శ్రీనివాసులు రెడ్డిలు ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ విచారణ కొనసాగిస్తోంది. విచారణలో భాగంగా హైదరాబాద్ నుంచి దిల్లీకి నగదు బదిలీపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా హవాలా వ్యవహారాలు నడిపే 20 మందిని ఈడీ ప్రశ్నించింది. ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబును ఇటీవల ఈడీ మరోమారు ప్రశ్నించింది. రానున్న రోజుల్లో మరికొంత మందిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్యాప్తును ఈడీ గోప్యంగా నిర్వహిస్తోంది.