YSRCP MP Gorantla Madhav on Chandrababu: చంద్రబాబుపై నోరు పారేసుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్.. ఏమన్నారంటే..! - MP Gorantla Madhav news
Published : Oct 27, 2023, 3:31 PM IST
YSRCP MP Gorantla Madhav on Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నోరు పారేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ తిరిగి సీఎం అవుతారని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చావడం ఖాయమని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 175కి 175 సీట్లు గెలుస్తుందని పేర్కొన్నారు.
MP Gorantla Madhav Comments:అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం శింగనమలలో శుక్రవారం నిర్వహించిన వైసీపీ సంక్షేమ సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లపై నోరు పారేసుకున్నారు. ''2024లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తారు..చంద్రబాబు నాయుడు గారు చస్తారు. ఇది గ్యారెంటీ. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే.. పంచాయితీ నుంచి మొదలుకొని మండలాలు, జెడ్పీ, మంత్రివర్గం, ఉప ముఖ్యమంత్రుల వరకూ.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉండేలా వారికి అవకాశం కల్పించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో 175కి 175 గెలుస్తున్నాం.. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.'' అని అన్నారు.