వైఎస్సార్సీపీ ఇంఛార్జీల నాలుగో జాబితా విడుదల - mlas Fourth List
Published : Jan 18, 2024, 10:45 PM IST
YSRCP Incharge Leaders Fourth List:సుదీర్ఘ కసరత్తు తర్వాత వైఎస్సార్సీపీ మరికొన్ని స్థానాలకు ఇన్‌ఛార్జిలను మార్పు చేసింది. తొమ్మిది పేర్లతో కూడిన నాలుగో జాబితాను గురువారం రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈమేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్‌ఛార్జిలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నాలుగో జాబితాలో 9 మంది పేర్లను ప్రకటించారు.
ఇన్‌ఛార్జ్‌ల నాలుగో జాబితా విడుదల:
వైఎస్సార్సీపీ పార్టీ ఇన్‌ఛార్జ్‌ల నాలుగో జాబితా విడుదల
చిత్తూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా నారాయణస్వామి
జీడీ నెల్లూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా రెడ్డప్ప
శింగనమల వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా వీరాంజనేయులు
తిరువూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నల్లగట్ల స్వామిదాసు
కొవ్వూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా వెంకట్రావు
నందికొట్కూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా డా.సుధీర్ దారా
మడకశిర వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈర లక్కప్ప
కనిగిరి వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నారాయణ యాదవ్
గోపాలపురం వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా తానేటి వనిత
హోంమంత్రి అసెంబ్లీ స్థానం మార్పు, కొవ్వూరు నుంచి గోపాలపురానికి మారిన తానేటి వనిత