తెలంగాణ

telangana

YS Viveka murder case update

ETV Bharat / videos

YS Viveka murder case update : గుండెపోటు నుంచి గొడ్డలివేటుగా మారిన క్రైమకథ.. బాబాయ్​ కేసు గుట్టురట్టైందా? - Former MP YS Viveka murder case

By

Published : Jul 22, 2023, 10:39 PM IST

Witnes Statements in YS Viveka murder case : తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కేసు వై.ఎస్.వివేకా హత్యోదంతం. గుండెపోటు అన్న మాట నుంచి గొడ్డలివేటుతో మొదలైన ఈ క్రైమ్‌ స్టోరీలో ప్రతి ఘట్టం ఉత్కంఠ భరితమే. చనిపోయింది ఒక మాజీ సీఎం సోదరుడు, మరో ప్రస్తుత సీఎం బాబాయి కావడంతో అది మరింత పెరిగింది. ఇంత కాలంగా ఈ కేసులో ఉన్న ముసుగులు ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. బాబాయి హంతకులెవరు? ఎలా కథ నడిపించారనే సంగతులు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిపై హత్యానేరం మోపడంతో పాటు సీబీఐ సాక్షుల వాంగ్మూలాలతో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో అనేక దిగ్భ్రాంతికర విషయాలు ఉన్నాయి. వైఎస్​ వివేక కుమార్తె సునీతా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఏపీ సీఎం జగన్​ సతీమణి పేరు ప్రస్తావనకు రావడంతో ఈ కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో సజ్జలకు సంబంధించి కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. భారతీ, సజ్జల వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్లను కూడా.. సీబీఐకి ఇచ్చినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు. షర్మిల ఇచ్చిన వాంగ్మూలంలో కుడా వై.ఎస్‌. వివేకా హత్యవెనుకున్నది రాజకీయ కారణాలుగా తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details