YS Vijayamma: మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న విజయమ్మ - షర్మిల అరెస్టుపై వైఎస్ విజయమ్మ మండిపాటు
YS Vijayamma Slaps Police in Hyderabad: వైఎస్ షర్మిలను చూసేందుకు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా... పోలీసులు అడ్డుకున్నారు. బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైనందున అక్కడికే వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో పోలీసులు, విజయమ్మకు మధ్య... స్వల్ప వాగ్వాదం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించిన విజయమ్మ... ఓ మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత విజయమ్మను బలవంతంగా కారులో ఎక్కించిన పోలీసులు... అక్కడినుంచి తరలించారు.
షర్మిలను ఎందుకు అరెస్టు చేశారని పోలీసులను ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోందన్న విజయమ్మ... ప్రజల కోసం పోరాడే గొంతుకను అరెస్టు చేస్తారా అని నిలదీశారు. పోలీసులకు చేతనైనపని షర్మిలను అరెస్టు చేయడమే అని ఆమె వ్యాఖ్యానించారు. షర్మిల అరెస్ట్ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విజయమ్మ స్పష్టంచేశారు. అంతకుముందు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి... జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.