YS Vijayamma: న్యాయం ప్రశ్నించే గొంతుకను ఆపేస్తారా?: విజయమ్మ
YS Vijayamma Respond to YS Sharmila arrest: వైఎస్ షర్మిల అరెస్ట్‌పై వైఎస్ విజయమ్మ స్పందించారు. షర్మిల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని విజయమ్మ ఆరోపించారు. ఆమె బయటకు ఎక్కడికీ వెళ్లకూడదా అని ప్రశ్నించారు. ఎవరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదా నిలదీశారు. పోలీసులు మీదపడుతుంటే ఆవేశం రాదా? అని పేర్కొన్నారు. షర్మిల డ్రైవర్‌పై కూడా దాడి చేశారని వివరించారు. పోలీస్‌స్టేషన్ వద్ద మహిళా పోలీసులు తన మీదపడ్డారని వైఎస్ విజయమ్మ ఆరోపించారు. పది మంది మహిళా పోలీసులు తన మీద పడ్డారని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. తాను కూడా పోలీసులను కొట్టినట్లు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్ ఆశయాలు నెరవేర్చేందుకు షర్మిల తెలంగాణకు వచ్చారని తెలిపారు. ఎంతకాలం ఆమెను గృహ నిర్బంధం చేస్తారని ప్రశ్నించారు. న్యాయం ప్రశ్నించే గొంతుకను ఆపేస్తారా అని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోందని అన్నారు. పోలీసులకు చేతనైన పని పేపర్ లికేజీ కేసులో అసలు నిందితులను పట్టుకోవడం కాదని.. షర్మిలను అరెస్టు చేయడమేనని వ్యాఖ్యానించారు. షర్మిల అరెస్టుపై కోర్టును ఆశ్రయిస్తామని విజయమ్మ వెల్లడించారు.