తెలంగాణ

telangana

YS Sharmila met DK Shivakumar

ETV Bharat / videos

YS Sharmila Meest DK Shivakumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​తో వైఎస్ షర్మిల భేటీ - YS Sharmila meet with DK Shivakumar in Bangalore

By

Published : May 29, 2023, 2:08 PM IST

YS Sharmila Meets DK Shivakumar : రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఇటీవలే ఆ పార్టీని.. కాంగ్రెస్​లో విలీనం చేస్తారనే ఊహగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే వీటిపై వైఎస్ షర్మిల స్పందించారు. తాను కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకుంటే పార్టీని ఎందుకు పెడతానని షర్మిల ప్రశ్నించారు. తమది పేదల కోసం, నిరుద్యోగుల కోసం పోరాడే పార్టీ అని స్పష్టం చేశారు. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచనలో లేమని వివరించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్​ నుంచి 19 మంది గెలిస్తే ఎంత మంది మిగిలారని? అన్నారు.  

ఈ క్రమంలో తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను వైఎస్ షర్మిల కలవడం చర్చనీయాంశమైంది. బెంగళూరులో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని డీకే శివకుమార్​ను అభినందించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని శివకుమార్‌ గుర్తుచేసినట్లు షర్మిల పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details