తెలంగాణ

telangana

YS Sharmila invited Pawan Kalyan to her son Raja Reddy wedding

ETV Bharat / videos

జనసేన అధినేత పవన్​ను కలిసిన షర్మిల - కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రిక అందజేత - వైఎస్ రాజారెడ్డి పెళ్లి

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 9:12 PM IST

YS Sharmila invited Pawan Kalyan to her son Raja Reddy wedding: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ను ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్​లోని పవన్ నివాసానికి వచ్చిన షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహనికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కాబోయే నూతన జంట వివరాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఎంపికైన సందర్భంగా షర్మిలకు పవన్ కల్యాణ్ పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. 

 ఇప్పటికే తన కుమారుడి పెళ్లి వేడుకలకు రావాలంటూ రాష్ట్రంలోని ప్రముఖులను వైఎస్ షర్మిల కలుస్తున్నారు.  వారికి పెళ్లి ఆహ్వాన పత్రికలు అందిస్తూ వస్తూ వస్తున్నారు. షర్మిల అన్న ఏపీ సీఎం జగన్​, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందిస్తూ వస్తున్నారు. తాజాగా నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను  కలిసి వైఎస్ రాజారెడ్డి  పెళ్లికి రావాలంటూ ఆహ్వానించారు. 

గురువారం రాత్రి ఎంగేజ్​మెంట్​: షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం రేపు జరగనుంది. హైదరాబాద్​లోని గండిపేట గోల్కొండ రిసార్ట్స్​లో ఈ వేడుక నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్​ హాజరు కానున్నారు. గురువారం సాయంత్రం 6.45 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి శంషాబాద్​ చేరుకుంటారు. అక్కడినుంచి కార్యక్రమం జరిగే రిసార్ట్స్​కు చేరుకుంటారు. కార్యక్రమంలో పాల్గొని తిరిగి రాత్రి 8.30 గంటలకు తాడేపల్లి బయలుదేరుతారు. 

ABOUT THE AUTHOR

...view details