YS Sharmila Interesting Comments : 'రాష్ట్రంలో 43 స్థానాల్లో మా పార్టీ ప్రభావం ఉంది' - కర్ణాటక ఫలితాలపై స్పందించిన వైఎస్ షర్మిల
YS Sharmila Interesting Comments : టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసును సిట్‌తో సెట్ చేస్తున్నారని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఐటీ శాఖ మంత్రి సరిగ్గా పని చేస్తే పేపర్ లీక్ అయ్యేది కాదని అన్నారు. ఐటీ శాఖ వైఫల్యం వల్లే పేపర్ లీక్ జరిగిందని విమర్శించారు. ఉద్యోగ పరీక్షల నిర్వహణపై కేసీఆర్ అఫిడవిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని అఫిడవిట్ ఇవ్వాలని కోరారు.
కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకుంటే తాను పార్టీని ఎందుకు పెడతానని? షర్మిల ప్రశ్నించారు. తమది పేదల కోసం, నిరుద్యోగుల కోసం పోరాడే పార్టీ అని.. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచనలో లేమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిస్తే ఎంత మంది మిగిలారని అడిగారు. గెలిచినవారిని కాపాడుకునే సత్తా హస్తం పార్టీకి ఉందా? అని నిలదీశారు. రాష్ట్రంలో 43 స్థానాల్లో వైఎస్‌ఆర్‌టీపీ ప్రభావం ఉందని దిల్లీ సంస్థ సర్వే చెప్పిందని వైఎస్ షర్మిల తెలిపారు.