తెలంగాణ

telangana

YS Sharmila protest on woman Third Degree Incident

ETV Bharat / videos

YS Sharmila Fires on LB Nagar Police : గిరిజన మహిళకు న్యాయం చేయాలంటూ షర్మిల రాస్తారోకో.. బలవంతంగా అరెస్ట్ - ఎల్బీనగర్​ పోలీసులు తాజా వార్తలు

By

Published : Aug 20, 2023, 8:12 PM IST

Updated : Aug 20, 2023, 8:22 PM IST

YS Sharmila Protest Against Tribal Woman Third Degree Incident :గిరిజన మహిళపై పోలీసుల దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇవాళ బాధిత మహిళను వైఎస్సార్​టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల పరామర్శించి.. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళ చికిత్స పొందుతున్న ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఆమెకు మద్దతుగా స్థానిక నేతలతో పాటు కొందరు మహిళలు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని షర్మిలను(Sharmila Arrest) బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్​ షర్మిల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ సమయంలో స్వల్ప తోపులాట, లాఠీ ఛార్జ్ జరిగింది. అనంతరం మాట్లాడిన షర్మిల.. అర్ధరాత్రి మహిళ అని చూడకుండా స్వాతంత్య్రం వచ్చిన రోజు పోలీసులు ఈ అరాచకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయకుండా ఒక మహిళపై థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగించారని ప్రశ్నించారు. బాధితురాలికి వెంటనే రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Last Updated : Aug 20, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details